
ఎర్రిగెడ్డలో వ్యర్థాలు వెలికి తీయండి
డాబాగార్డెన్స్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఆదివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను, అలాగే ఎర్రిగెడ్డ వద్ద వ్యర్థాల తొలగింపు పనులను స్వయంగా పరిశీలించారు. వర్షాల వల్ల చెట్లు కూలడం, కాలువల్లో నీరు నిలవడం వంటి సమస్యలపై ఇప్పటివరకు 41 ఫిర్యాదులు అందాయని, వాటిలో 37 ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించామని అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఎర్రిగెడ్డలో అధికంగా చేరుతున్న వ్యర్థాలను నిరంతరం తొలగించేందుకు జేసీబీ యంత్రాలను ఉపయోగించాలని కమిషనర్ ఆదేశించారు.