
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు
కూర్మన్నపాలెం: గాజువాకలో ఒక గ్యాస్ సిలిండర్ నుంచి మరొక సిలిండర్‌లోకి గ్యాస్ మార్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొత్తగాజువాకకు చెందిన ఎం. కృష్ణ (56), పాతగాజువాకకు చెందిన ఎన్. లక్ష్మి (48), ఆమె మనుమరాలు శిరీష (8) ఉన్నారు. వీరందరికీ ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణ అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారం చేస్తున్నాడు. లక్ష్మి తన మనుమరాలితో కలిసి గ్యాస్ నింపుకోవడానికి వచ్చినప్పుడు, చిన్నారి శిరీష పక్కనే ఉన్న లైటర్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు