
ముంచెత్తిన వాన
జ్ఞానాపురం చావులమదుం వద్ద..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నా.. నగరం వైపు మాత్రం వరుణుడు కన్నెత్తి చూడలేదు. విశాఖ చుట్టుపక్కలా వర్షాలు పడుతున్నా.. నగరంలో మాత్రం భారీ వర్షమే కరువైంది. ఎట్టకేలకు విశాఖవాసుల వర్షపు దాహాన్ని వరుణ దేవుడు తీర్చాడు. విశాఖకు సమీపంలో ఉన్న రుతుపవన ద్రోణి, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం.. మహా నగరాన్ని ముంచెత్తింది. గెడ్డలు పొంగిపొర్లాయి. రహదారులు జలమయమైపోయాయి. లోతట్టుప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడం, డ్రైన్లు శుభ్రం చెయ్యకపోవడంతో కాలువల్లో పూడిక పేరుకుపోయింది. దీంతో వరద నీరు పారే అవకాశం లేక.. నగరం జలమయమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో.. వాహనాలు కదిలే వీలు లేక ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అక్కయ్యపాలెంలో కురుస్తున్న వర్షం

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన