
అందరి వద్దా అప్పులే...!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసింది. ఈ స్థానంలో ప్రైవేటు దుకాణాలకు తెరలేపింది. దీంతో ఈయన వసూళ్లకు మంచి అవకాశం లభించింది. తన పరిధిలో ఏర్పాటైన ప్రతీ ప్రైవేటు మద్యం దుకాణం యజమాని నుంచి ఆయన అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తే... ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ప్రైవేటు మద్యం దుకాణదారుల నుంచి లక్షల్లో అప్పులు తీసుకున్నారు. అంతేకాకుండా బార్ల యజమానుల నుంచి కూడా అప్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. మొత్తంగా రూ.లక్షల్లో తీసుకున్న అప్పులను ఆయన ఎవరికీ తిరిగి చెల్లించలేదని సమాచారం. వీరందరూ కాస్తా ఉన్నతాధికారులకు సిఫారసు చేయడంతో సెలవులో వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. అయితే, తాను సెలవులో మాత్రమే వెళుతున్నానని, తిరిగి ఇక్కడకే వస్తానంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగుతూ.. అప్పులిచ్చిన వారు తిరిగి అడగకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా నేరుగా చినబాబు పేరు కూడా చెబుతుండటంతో ఎవరూ నోరెత్తడం లేదని సమాచారం.