
రూ.1,471 కోట్లతో షిప్‌యార్డ్ రికార్డు
సింథియా: హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్‌ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రూ.1,471 కోట్ల టర్నోవర్‌ను సాధించిందని వెల్లడించారు. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే ప్రథమం అని తెలిపారు. ఐఎస్‌ఎస్ నిస్తార్, ఐఎన్‌ఎస్ సింధుకీర్తి వంటి నౌకలను నిర్మించి షిప్‌యార్డ్ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ పోటీల్లో విజేతలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.