
స్టీల్‌ప్లాంట్‌లో..
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లోని త్రిష్ణా మైదానంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ ఎస్.సి. పాండే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉద్యోగుల అంకితభావం, కృషి ఫలితంగా ఇటీవల ప్రారంభించిన బ్లాస్ట్‌ఫర్నేస్–3 ద్వారా స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిలో మంచి పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల భవిష్యత్‌లో స్టీల్‌ప్లాంట్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు జి.వి.ఎన్.ప్రసాద్, సలీమ్ జి.పురుషోత్తమన్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.