
సరుకు రవాణాలో ముందంజ
సీతంపేట: విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌లో విశాఖపట్నం పోర్టు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు సహకరించిన పోర్టు ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. కాలుష్య నివారణ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పోర్టు చరిత్రలోనే రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాక్‌డ్రిల్, స్నిఫర్ డాగ్ ప్రదర్శనలు అలరించాయి. పోర్టులో పనితీరులో విశేష ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, పోర్టు భాగస్వాములు, స్టేక్ హోల్డర్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేశారు. పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.