
ప్రగతి పథంలో వాల్తేరు డివిజన్
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధిలోని రైల్వే ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. డీఆర్‌ఎం లలిత్‌బోహ్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆర్పీఎఫ్, సివిల్ డిఫెన్స్ బృంద సభ్యుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన వాల్తేర్ డివిజన్ సాధించిన ప్రగతిని వివరిస్తూ.. ‘బ్లూచిప్ డివిజన్’గా ప్రకాశిస్తోందన్నారు. వాల్తేర్ డివిజన్ కల్చరల్ అసోసియేషన్, స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే భద్రతా దళం ప్రదర్శించిన డేర్ డెవిల్స్ షో ఆహూతులను ఎంతగానో అలరించింది. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్ఫ్రా) ఈ.శాంతారం, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోహ్రా, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.పి.దూబే, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ యూసుఫ్ కబీర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.