
నగర పోలీస్‌కు ఇండియన్ ప్రెసిడెన్సీ మెడల్
డాబాగార్డెన్స్: సిటీ సెంట్రల్ క్రైం స్టేషన్ ఏఎస్‌ఐ పెదిరెడ్డి చంద్రశేఖర్ 2025 ఇండియన్ ప్రెసిడెన్సీ మెడల్‌కు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 20 మంది పోలీసు అధికారుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకై క ఏఎస్‌ఐ ఈయనే. చంద్రశేఖర్‌కు ఈ మెడల్ రావడం పట్ల పలువురు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఈ మెడల్ అందజేస్తారు. చంద్రశేఖర్ తన కెరీర్‌ను 1984లో కానిస్టేబుల్‌గా ప్రారంభించారు. అప్పటి నుంచి ట్రాఫిక్, క్రైం, శాంతిభద్రతల విభాగాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారు. అనేక కేసులను ఛేదించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆయన్ని సత్కరించారు.