
సమష్టి కృషితో విశాఖ నగరాభివృద్ధి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఆవరణలో మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, పలువురు కార్పొరేటర్లతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఆవిష్కరించారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ అందరి సహకారంతో విశాఖ నగర అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం చెట్లు పెంచండి అనే నినాదంతో జీవీఎంసీ కె.కాలనీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం అలరించింది. జీవీఎంసీలో ప్రతిభ కనబరచిన పలువురు అధికారులు, ఉద్యోగులు, విశాఖ నగరాభివృద్ధికి సహకరిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, బ్యాంకుల ప్రతినిధులకు కమిషనర్ ప్రశంసాపత్రాలు అందజేశారు.