
ఆటోలే దిక్కు..
ఈ నెల 6న వెంకటలక్ష్మి అనే మహిళ డెలివరీ కోసం కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరింది. ఈ నెల 7వ తేదీన పాప జన్మించింది. ఆమెను 11వ తేదీన డిశ్చార్జి చేశారు. ఆమె కుటుంబ సభ్యులు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు ఫోన్ చేయగా.. వాహనాలు నడపడం లేదని.. డీజిల్ లేదని.. మరమ్మతులకు గురయ్యాయని డ్రైవర్లు సమాధానం ఇచ్చారు. దీంతో వెంకటలక్ష్మి పాపతో ఆటోలో గాజువాకలోని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల ఇద్దరు బాలింతలు ఇదే విధంగా ఆటోలో ఇంటికి వెళ్లడం ఆస్పత్రిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 12వ తేదీన కూడా ఓ బాలింతకు ఇదే పరిస్థితి ఎదురైంది.