
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేఐవోసీఎల్ పెల్లెట్లు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఖుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (కేఐవోసీఎల్) నుంచి పెల్లెట్ల సరఫరా ప్రారంభమైంది. పరిశ్రమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంతో, కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్, కేఐవోసీఎల్ మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కేఐవోసీఎల్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఏడాదికి 2 మిలియన్ టన్నుల పెల్లెట్లను సరఫరా చేయనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఓడ ద్వారా మొదటి బ్యాచ్‌ను పంపించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ ‘ఎక్స్’లో వెల్లడించారు.