
మొరాయిస్తున్న వాహనాలు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు జిల్లాలో 23 ఉండగా.. ఇందులో 8 వాహనాలు మూలకు చేరాయి. 5 వాహనాలు చిన్న చిన్న రిపేర్లతో నగరంలో ఒక ప్రైవేటు షోరూమ్‌లో ఉన్నాయి. కేజీహెచ్‌లో ఉన్న వాహనాలకు టైర్లు పేలిపోవడం, ఇంజిన్ మరమ్మతులు, ఇతర చిన్న చిన్న సమస్యలతో పక్కన పెట్టారు. రిపేర్లు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వాహనానికి ఒకరు చొప్పున 56 మంది డ్రైవర్లు (కెప్లెన్లు) పనిచేస్తున్నారు. కేజీహెచ్‌లో 9 వాహనాలు ఉన్నాయి. 3 వాహనాలను మరమ్మతు పేరిట మూలన పెట్టారు. 2 వాహనాలు షోరూమ్‌లో ఉంచారు. ఇప్పుడు నాలుగు వాహనాలు మాత్రమే బాలింతలను తరలించడానికి అందుబాటులో ఉన్నాయి. ఇలా అరకొర వాహనాలే ఉండడంతో బాలింతలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు వెళ్తున్నారు.