
యువత వ్యసనాలకు బానిసలు కావొద్దు
ఏయూ క్యాంపస్: యువతరం మత్తుపదార్థాలకు బానిసలు కారాదని, ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలంటూ బీచ్‌రోడ్డులో రెడ్ రన్ నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూత్ డే వేడుకల్లో భాగంగా బాల బాలికలకు పరుగు పోటీలు నిర్వహించారు.
కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యకరమైన జీవనం అలవాటు చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిసలైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ రమేష్, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రన్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బాల బాలికలకు వేర్వేరుగా ప్రథమ స్థానంలో నిలచిన వారికి రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.7 వేలు నగదు బహుమతులను అందించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

యువత వ్యసనాలకు బానిసలు కావొద్దు