
సమర్థ న్యాయవాదులు అవసరం
సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాయ్
విశాఖ లీగల్: న్యాయ వ్యవస్థ బలోపేతం కావడానికి సమర్థవంతమైన న్యాయవాదులు అవసరమని గుజరాత్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివంగత న్యాయవాది ఎం.సత్యనారాయణ చిత్రపటాన్ని జస్టిస్ రాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన కేసులు వివరించే తీరు, ప్రవర్తన నేటి యువ న్యాయవాదులకు ఆదర్శం కావాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ దిగువ స్థాయి నుంచి ఎదిగి, ఎందరో న్యాయవాదులకు సత్యనారాయణ మార్గదర్శకంగా నిలిచారన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోర్టుల్లో సత్యనారాయణ వ్యవహరించిన తీరు తమకు ఎంతో నేర్పిందని చెప్పారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యు డు పి.నర్సింగరావు, న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పి.నాయుడు, పైలా సన్నీబా బు, నమ్మి సన్యాసిరావు, సత్యనారాయణ కుమారు డు, న్యాయవాది అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.