
● భారత్ మాతా కీ జై
● ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టిన థింసా నృత్యాలు
● అదిగదిగో.. అద్దాల అడ్వెంచర్!
కై లాసగిరిపై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్కై గ్లాస్ బ్రిడ్జ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గతవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే ఈ అడ్వెంచర్ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
గిరిజన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద గిరిజన విద్యార్థులు థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. కొంత మంది విద్యార్థులు సంప్రదాయ గిరిజన దుస్తులు ఽ
దరించి, లయబద్ధంగా థింసా నృత్యంతో అలరించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని, వాటి విశిష్టతను చాటి చెప్పారు.
● ఆకట్టుకున్న పాట్ పెయింటింగ్
కొమ్మాది: సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరంలో ఆదివారం జరిగిన పాట్ పెయింటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ నెల 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

● భారత్ మాతా కీ జై

● భారత్ మాతా కీ జై

● భారత్ మాతా కీ జై