● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపుల నిర్వహణ ● మరోసారి దివ్యాంగులకు వైద్య పరీక్షలు ● చిన్న తేడా ఉన్నా పింఛన్‌ తొలగించాలని ఆదేశాలు | - | Sakshi
Sakshi News home page

● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపుల నిర్వహణ ● మరోసారి దివ్యాంగులకు వైద్య పరీక్షలు ● చిన్న తేడా ఉన్నా పింఛన్‌ తొలగించాలని ఆదేశాలు

Aug 11 2025 7:29 AM | Updated on Aug 11 2025 7:29 AM

● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపు

● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపు

మొత్తం దివ్యాంగులు 21,306

ఆర్థోపెడిక్‌ 12,238

అంధులు 2,373

ఈఎన్‌టీ 2,287

మానసిక 4,408

రీ వెరిఫికేషన్‌

జరిగినవి 16,187

రీ వెరిఫికేషన్‌

చేయాల్సినవి 5,119

పింఛన్ల నిలుపుదల

అంచనా 5-12 శాతం

మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌ ప్రక్రియతో దివ్యాంగుల్లో అలజడి నెలకొంది. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న భయాందోళన మొదలయింది. రీ వెరిఫికేషన్‌లో సర్టిఫికెట్‌ రద్దు చేస్తే, వైకల్య శాతం తగ్గిస్తే.. లాంటి ఆలోచనలు వారిని మరింత ఆదోళనకు గురిచేస్తున్నారు. రీ వెరిఫికేషన్‌కు రాని వారికి తాజాగా పింఛన్‌ కోత పడింది. ఆరు నెలల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. అనారోగ్యం, ఇతర కారణాలతో రీ వెరిఫికేషన్‌కు రాలేని వారి పింఛన్లకు ఆ తర్వాతి నెల్లో కోత విధిస్తున్నారు. మొన్న మంచాన పట్టిన వారిని, నిన్న మానసిక వికలాంగులను వదల్లేదు. ఇప్పుడు అంధుల బతుకుల్ని మరింత అంధకారంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యారు.

రెండో విడత ఏరివేత

వివిధ కేటగిరీల్లో రూ.6 వేలు నుంచి రూ.15 వేలు పింఛన్‌ పొందుతున్న దివ్యాంగుల ఏరివేత కార్యక్రమానికి కూటమి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో వీరు 21,306 మంది ఉండగా ఇప్పటి వరకు 16,187 మంది రీ వెరిఫికేషన్‌ పూర్తయింది. ఇంకా 5,119 మందికి రీ వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది. వీరిలో కొంత మంది వివిధ కారాణాల వల్ల రీ వెరిఫికేషన్‌ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పింఛన్‌ నిలుపుదల చేశారు. ఎంత మందికి నిలుపుదల జరిగిందన్న విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది.

కూటమి సర్కార్‌ ప్రగల్భాలు

ఎన్నికలకు ముందు దివ్యాంగుల పింఛన్‌ పెంపుపై ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇపుడు లబ్ధిదారుల తగ్గింపు కుట్రకు తెరతీసింది. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు తెలివిగా రీవెరిఫికేషన్‌ బాట పట్టింది. పరిశీలన చేయించుకోని వారికి తర్వాతి నెల నుంచే పింఛన్‌ కట్‌ చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్లు తీసుకునే వారి మీద ర్యాండమ్‌ సర్వే చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, 6 వేలు పింఛను తీసుకున్న మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరికి పరీక్షల నిమిత్తం సంబంధిత ఆస్పత్రులకు రప్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏ సాకు పేరిట తమ జీవనాధారమైన పింఛన్‌కు కోత పెడతారోనని దివ్యాంగుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement