
ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
డాబాగార్డెన్స్: స్థాయీ సంఘం ఎన్నికలో కొణతాల నీలిమకు అత్యధికంగా 58 ఓట్లు రాగా, గంకల కవితకు 57, దాడి వెంకట రామేశ్వరరావుకు 57, మొల్లి హేమలతకు 57, సేనాపతి వసంతకు 54, గేదెల లావణ్యకు 53, మాదంశెట్టి చిన్నతల్లికి 52, రాపర్తి త్రివేణి వరప్రసాదరావుకు 52, మొల్లి ముత్యాలు 51, సాడి పద్మావతి(పద్మారెడ్డి)కి 50 ఓట్లు పోలయ్యాయి.
వైఎస్సార్ సీపీకి లెక్కకు మించి..
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు లెక్కకు మించి ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్ సీపీకి 32 మంది కార్పొరేటర్ల బలమే ఉన్నప్పటికీ.. కూటమి పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు ఓట్లు వేశారు. సాడి పద్మారెడ్డికి 50, నెక్కల లక్ష్మికి 39, పల్లా అప్పలకొండకు 38, మహ్మద్ ఇమ్రాన్‌కు 38, కోడిగుడ్ల పూర్ణిమకు 38, రెయ్యి వెంకటరమణకు 37, గుండాపు నాగేశ్వరరావుకు 35, ఉరుకూటి రామచంద్రరావుకు 35, కేవీఎన్ శశికళకు 34, బిపిన్ కుమార్ జైన్‌కు 33 ఓట్లు పోలయ్యాయి.