
ఏయూ–జేఎంఎం పరస్పర సహకార ఒప్పందం
మద్దిలపాలెం: ఏయూ–జపాన్ ఆటోమేటిక్ మెషీన్ కో లిమిటెడ్(జేఎంఎం) మధ్య పరస్పర సహకారానికి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో వైరింగ్ హార్నెస్, అధునాతన కనెక్టర్ తయారీ సాంకేతికతలు, అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్ జాయింట్ల కోసం నాన్–డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పద్ధతులు, మెషిన్ టూల్ డిజైన్ తయారీలో ఏఐ అప్లికేషన్లు అనే అంశాలపై చర్చించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ ఆవిష్కరణలు, అప్లైడ్ రీసెర్చ్, పరిశ్రమ భాగస్వామ్యాలకు అనుగుణంగా జరిగిన ఒప్పందం మేరకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. జేఎఎం ప్రతినిధులు పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నారు. అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య కె. శ్రీనివాసరావు, డీన్ ఔట్రీచ్ ఆచార్య కె.రమాసుధ, పలువురు డీన్లు, అధికారులు పాల్గొన్నారు.