
సింహగిరి నుంచి దాసుడు తిరుగు పయనం
సింహాచలం: ఒడిశాకి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ బుధవారం సింహగిరిపై నుంచి తిరుగుపయనమయ్యారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి విశేష సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ ఈ ఏడాది మే నెలలో సింహగిరికి వచ్చారు. సింహగిరిపై ఉన్న దాసుల ఆశ్రమంలో సుమారు మూడు నెలలపాటు ఉండి స్వామికి విశేష సేవలందించారు. నిత్యకల్యాణం, గరుడసేవ, ఊంజల్‌సేవ, కోలా సేవ, లక్ష తులసి పూజ తదితర సేవలను జరిపించారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం సింహగిరి నుంచి తిరుగు పయనమయ్యారు. ఈవో కార్యాలయం వద్ద దేవస్థానం అధికారులు ఆయన్ని సత్కరించారు.