సాక్షి, విశాఖపట్నం: చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలని నీతిఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. నోవోటల్ హోటల్‌లో ఎంఎస్‌ఎంఈల సాధికారతపై సీఐఐ సహకారంతో ఏపీ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్, నీతి ఆయోగ్ బుధవారం సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల మనుగడ నేపథ్యంలో ప్రతి విషయంలోనూ ప్రభుత్వాలు చేయూతనందించాలని సూచించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈల పరంగా విశాఖ జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో సీఐఐ ఎంఎస్‌ఎంఈ చైర్మన్ పొన్నుస్వామి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు, అనకాపల్లి జిల్లా డీఐసీ జీఎం నాగరాజారావు, డీఐసీ సహాయ సంచాలకులు జోగినాథ్, సూపరింటెండెంట్ ఆర్‌ఆర్‌ఎస్ మహేష్, ఐపీవోలు హామిని, త్రివేణి, సునీత, జ్యోతితో పాటు సుమారు 300కి పైగా ఎంఎస్‌ఎంఈ హోల్డర్లు సదస్సుకు హాజరయ్యారు.
ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్‌లో
నీతిఆయోగ్ సలహాదారు సంజీత్ సింగ్