మహారాణిపేట: వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజాహితమే లక్ష్యంగా 15 ఏళ్లుగా పార్టీ పనిచేస్తుందని నేతలు తెలిపారు.
విశాఖ జిల్లా వలంటీర విభాగం అధ్యక్షురాలు పీలా ప్రేమ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, మళ్ల విజయ ప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, జాన్ వెస్లీ, పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ జహీరాబాద్, ఉడా రవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నడింపల్లి కృష్ణంరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీ వాస్తవ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి హరికిరణ్ రెడ్డి, డాక్టర్ మంచా నాగ మల్లీశ్వరి, అనుబంధ విభాగ అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివ రామకృష్ణ, బొండా మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


