మహారాణిపేట: విశాఖ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో, ప్రైవేట్ ప్రాక్టీస్(ఏఆర్‌టీ లెవల్–1) చేస్తున్న గైనకాలజిస్ట్‌లు తప్పనిసరిగా నేషనల్ రిజిస్టర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు సూచించారు. నేషనల్ రిజిస్టర్ పోర్టల్‌లో దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని.. వాటిని పూర్తి చేసి 18లోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలన్నారు. రిజిస్టర్ చేసుకోని వారిపై ఏఆర్‌టీ రెగ్యులేషన్ యాక్ట్ 2021, రూల్స్ 2022 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.