
ఫిర్యాదులు స్వీకరిస్తున్న చీఫ్ సిటీ ప్లానర్
డాబాగార్డెన్స్: టౌన్‌ప్లానింగ్ ఓపెన్ ఫోరంలో 8 ఫిర్యాదులు అందాయి. చీఫ్ సిటీ ప్లానర్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో డీసీపీలు, ఏసీపీలు, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, డబ్ల్యూఆర్‌ఎస్ సిబ్బంది పాల్గొన్న ఓపెన్ ఫోరంలో జోన్–3 నుంచి రెండు, జోన్–4 నుంచి ఒకటి, జోన్–5 నుంచి నాలుగు, జోన్–6 నుంచి ఒక ఫిర్యాదు అందింది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ జీవీఎంసీ 8 జోన్లలో ఎలాంటి అనధికార నిర్మాణాలు, ఇతర ఫిర్యాదులకు జీవీఎంసీ టోల్‌ఫ్రీ నంబరు 1800 4250 0009కు ఫోన్ చేయాలన్నారు. అలాగే జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోన్ నంబరు 81878 97569కు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలపొచ్చన్నారు. కార్యక్రమంలో డీసీపీలు నరేంద్రరెడ్డి, వసంతకుమార్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.