మద్యం మత్తులో బావిలోకి దూకి
అఘాయిత్యం
మర్పల్లి: మతి స్థిమితం లేని వ్యక్తి మద్యం మత్తలో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం మర్పల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పులుమద్ది నర్సమ్మ కుమారుడు శ్రీకాంత్(28) మతి స్థిమితం కోల్పోయి తరచూ మద్యం తాగేవాడు. చనిపోతానని కుటుంబ సభ్యులకు పలుమార్లు చెప్పాడు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంట్లో నిద్రించాడు. తెల్లవారుజామున బయటికి వెళ్లి రాలేదు. తల్లి నర్సమ్మ పలు చోట్ల వెతకగా ఇంటి వద్ద గల పురాతన బావి విగతజీవిగా కనిపించాడు. చుట్టు పక్కల వారి సాయంలో బావి నుంచి శ్రీకాంత్‌ను పైకి తీసుకొచ్చారు. మర్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీకాంత్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎండీ గఫూర్ తెలిపారు.


