పాఠ్యపుస్తకాలకే పరిమితం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాలకే పరిమితం కావొద్దు

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

ఇబ్రహీంపట్నం: విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కావొద్దని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రవి గుగులోతు అన్నారు. ప్రశ్నించడం, ప్రయోగించడం, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లడం అలవర్చుకోవాలని, సమాజం ఎదుర్కొనే సమస్యలను గుర్తించి వినూత్న పరిష్కారాలను కనుగొనే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం నల్లకంచెలో టీజీఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్‌లో (బాలికల గురుకుల పాఠశాల) మూడు రోజుల పాటు నిర్వహించిన జోనల్‌ స్థాయి ‘బ్రెయిన్‌ రెయిన్‌–2026’ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన వివిధ ఎగ్జిబిట్స్‌ను పరిశీలించి, వాటి పనితీరు, ఉపయోగాలు, రూపకల్పన తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యార్థులు రూపొందిస్తున్న కొన్ని నమూనాలు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా మారే అవకాశముందన్నారు. ప్రతి ప్రయోగంలో ఒక ఆలోచన, పరిశోధనాత్మక దృక్పథం దాగి ఉంటుందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారి ఆలోచన విధానాన్ని, ఆవిష్కరణల సామర్థ్యాలను పెంపొందించేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్లు చక్కని వేదికలన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుందని, ఆ ప్రతిభను గుర్తించి తగిన అవకాశాలు కల్పించడమే గురుకులాల సంస్థ లక్ష్యమన్నారు. అనంతరం సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ప్రాజెక్ట్‌ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గురుకులాల జాయింట్‌ సెక్రటరీ సుక్కునాయక్‌, జోనల్‌ ఆఫీసర్‌ విద్యుల్లత, ప్రిన్సిపాల్స్‌ లీలావతి, ధనలక్ష్మి, కుర్షిద్‌, రేణుక, జయంతి, రమ, రాష్ట్ర గురుకులాల ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి

గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రవి గుగులోతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement