ఇంటిపై
సౌర పలక
పరిగి: వర్షాలు కురవక పోవడంతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది.. రోజురోజుకు వినియోగం అమాంతం పెరగడం.. దీనికి తోడు బిల్లుల భారం.. వీటన్నింటికీ సౌర విద్యుత్ పరిష్కార మార్గంగా మారింది. ఇంటిపై, అవరణలో సౌర పలకలు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సబ్సిడీపై సోలార్ యూనిట్లు మంజూరు చేస్తోంది. ప్రజలు ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులకు చెక్ పెట్టొచ్చు. రూఫ్‌టాప్ సోలార్ వినియోగం ద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు.
సబ్సిడీపై..
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక కిలో వాట్ సోలార్ ప్లాంట్‌కు రూ.30 వేలు, రెండు కిలో వాట్‌కు రూ.60 వేలు మూడు అంతకన్నా ఎక్కువ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుందుకు రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. రాయితీలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్లాంట్ ఏర్పాటుకు అయ్యో ప్రారంభం వ్యాయం తగ్గుతుంది. 3కిలో వాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1.8 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో రూ.78 వేల వరకు కేంద్రం సబ్సిడీ అందిచనుంది. అనుకూల పరిస్థితుల్లో నెలకు 360 యూనిట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి అయ్యో అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు, పై కప్పుపై సూర్యరశ్మి లభ్యత, ప్లాంట్ పనితీరు ఆధారంగా ఉత్పత్తి మారుతుంది. ఇంటి విద్యుత్ వినియోగం సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యో విద్యుత్‌కు అనుగుణంగా ఉంటే బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
వివిధ కంపెనీల రుణ సదుపాయం
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోడం ద్వారా సూర్యరశ్మి సహాయంతో విద్యుత్ ఉత్పత్త అవుతుంది. దీనివల్ల గ్రిడ్ నుంచి తీసుకునే విద్యుత్ వినియోగం తగ్గి నెలవారి బిల్లుపై ఆదా పొందవచ్చు. తద్వారా సోలార్ ప్లాంట్ సామర్థ్యం, ఇంటి విద్యుత్ వినియోగం, సౌర విద్యుత్ ఉత్పత్తని బట్టి బిల్లు జరో అవుతుంది. సోలాల్ విద్యుత్ ఏర్పాటుకు బ్యాంకులు కూడా అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణం ఇస్తూ నెలవారీగా చెల్లించే సదుపాయం కల్పిస్తున్నాయి. మిగులు విద్యుత్ ఉంటే విద్యుత్ శాఖకు విక్రయించుకుని అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. వివిధ కంపెనీల ప్రతినిధులు ప్రజలను నేరుగా సంప్రదించి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
మంచి స్పందన వస్తోంది
సోలార్ విద్యుత్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రామాల్లో 3కిలో వాట్ ప్లాంట్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా సబ్సిడీ ఇస్తోంది.
– నరసింహులు, కపిల్ గ్రూప్, సేల్స్ మేనేజర్
సోలార్ విద్యుత్ బాగుంది
ఇంటిపై 3కిలో వాట్ల సోలా ర్ ప్లాంట్ ఏర్పాటు చేశా. విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. రాత్రి వెళ మాత్రమే విద్యుత్ శాఖ నుంచి కరెంటు వాడుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సబ్పిడీ కూడా ఇస్తోంది.
– అరవింద్‌కుమార్, దోమ


