నేవీ రాడార్ పనులతోవన్యప్రాణులకు ఇక్కట్లు గ్రామాల్లోకి వచ్చి వీధి కుక్కల బారిన పడుతున్న వైనం తాజాగా ఓ జింక మృతి రక్షణ కల్పించాలంటున్న స్థానికులు
పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. అడవిలో నివసిస్తున్న జింకలు తరచూ వీధి కుక్కల దాడులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా కుక్కల దాడిలో ఓ జింక మృత్యువాత పడింది. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో అడవిలోని సహజ వాతావరణానికి విఘాతం కలుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణ పనుల కారణంగా అడవిలో నివసించే జింకలు, ఇతర వన్యప్రాణులు తమ సహజ ఆవాసాల నుంచి బయటకు వస్తున్నా యని చెబుతున్నారు. ఈ క్రమంలో జనావాసాల సమీపంలో సంచరిస్తున్న జింకలపై వీధి కుక్కలు దా డులు చేస్తున్నాయి. దీంతో అవి ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ కుక్కల దాడులు
దామగుండం అటవీ ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు కుక్కల దాడుల్లో జింకలు, ఇతర వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతి సారీ అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని జంతువుల కళేబరాలను తరలించడం తప్ప, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
అడవిలోని మూగజీవాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉందని స్థానికు లు పేర్కొంటున్నారు.నేవీ రాడార్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నా రు. అడవిలోకి వీధి కుక్కలు ప్రవేశించకుండాని యంత్రించడంతో పాటు, బయటకు వస్తున్న వన్య ప్రాణులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాల ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి దామగుండం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాల ని స్థానికులు,జంతు ప్రేమికులు కోరుతున్నారు.


