బాలల హక్కులను హరించడం నేరం | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులను హరించడం నేరం

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

మహిళా శిశు సంక్షేమ శాఖ

జిల్లా అధికారి కృష్ణవేణి

బొంరాస్‌పేట: బాలల హక్కులను హరించడం నేరమని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి అన్నారు. బుధవారం మండలంలోని చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలో మిషన్‌ వాత్సల్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. హెచ్‌ఎం రవీందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బాలల హక్కుల వాల్‌పోస్టర్‌ను విష్కరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి(డీసీపీఓ) శ్రీకాంత్‌ బాలల హక్కులు, చ ట్టాల, బాల్యవివాహాలగురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ శేరి రాజేశ్‌రెడ్డి, ఎంఈఓ హరిలాల్‌, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్‌ హెల్పలైన్‌, మహిళా సాధికారత, సఖీ కేంద్రం సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ‘చేయూత’

మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌

కొడంగల్‌: అర్హులందరికీ చేయూత పథకం పింఛన్లు అందిస్తామని కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా మంజూరు చేసిన వారికి పింఛను పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నట్లు చెప్పారు. పట్టణంలోని 12 వార్డుల్లో కొత్తగా 189 మందికి చేయూత ఫించన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరైనట్లు వివరించారు. మలి విడతలో వృద్ధులకు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, కమిషనర్‌ బలరాం నాయక్‌, కౌన్సిలర్లు కృష్ణంరాజు, అనిత, వాణిశ్రీ యాదవ్‌, రాజశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యులు రమేష్‌బాబు, మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌

తాండూరు టౌన్‌: ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బండారు శ్రీకాంత్‌ నియమితులయ్యారు. బుధవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు నాగారం మల్లేశం మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీ పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఫలితాన్ని ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు శ్రీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు, నాయకులు కృష్ణ, ప్రహ్లాద్‌, ప్రకాష్‌, చందు, బిచ్చప్ప, బబ్లు, సతీష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

21న ఆక్టోపస్‌లో

పాత వస్తువుల వేలం

ఇబ్రహీంపట్నం: వినోబానగర్‌లోని ఆక్టోపస్‌ కమాండో ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రాంగణంలో ఈ నెల 21న పాత వస్తువుల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సెంటర్‌ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులు, ఇనుప సామగ్రి, దుస్తులు, నిరుపయోగమైన కంప్యూటర్లు, ఆపరేషనల్‌ పరికరాలు, ఆట వస్తువులు తదదిత రకాల పాత వస్తువులను వేలం పాటలో విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి ఉన్నవారు గురు, శుక్రవారల్లో వస్తువులను పరిశీలించుకోవచ్చునని తెలిపారు. వేలంలో దక్కించుచుకున్న వస్తువులకు వెంటనే నగదు చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement