పరిగి మీదుగా ‘రీజినల్‌’ | - | Sakshi
Sakshi News home page

పరిగి మీదుగా ‘రీజినల్‌’

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

భూ సేకరణకు ఉత్తర్వులు జారీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి: నియోజకవర్గం మీదుగా సుమారు రూ.30 వేల కోట్ల వ్యయంతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు కోసం పోరాటం చేశానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో పరిగి మీదుగా వేయనున్నట్లు వివరించారు. పూడూరు, ఎన్కెపల్లి, గొంగుపల్లి తదితర గ్రామాల మీదుగా రోడ్డు వెళ్తుందన్నారు. ఇప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి పరిగి మీదుగా కొడంగల్‌ వరకు రేడియల్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. పరిగి – కృష్ణా రైల్వే లైన్‌ ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందన్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు. త్వరలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అనంతరం రైతులకు తెల్లజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రాములు, నాయకులు వెంకటేశ్‌, రాంరెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

పింఛన్‌ పత్రాల అందజేత

కుల్కచర్ల: సబ్బండ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల, చౌడాపూర్‌ మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు చేయూత పెన్షన్‌ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

రూ.30 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement