● ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● పరిగిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పరిగి: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. డీసీఎంఎస్ ఆధ్వర్యాన పట్టణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఈయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, యంత్రాలు, పనిముట్లను సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి పరిణామాలను రాజకీయాలతో ముడిపెట్టి ప్రజల్లో సృష్టించడం సరికాదన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చెబుతున్న లేనిపోని మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవాచేశారు. రబీలో వరి సాగు చేయకపోవడమే మంచిదని సూచించారు. తక్కువ నీటితో పండే పంటలే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్రాములు, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథిపంతులు, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తౌర్యనాయక్, తదితరులు పాల్గొన్నారు.


