మోమిన్‌పేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించిన వెల్‌చాల్ చర్చిని శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సందర్శించారు. చర్చిలో కాలిపోయిన ఫర్నిచర్‌ను పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులతో మాట్లాడారు. నీటి సమస్య పరిష్కారానికి బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీనివాస్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ శంకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురేందర్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
పరిగి: ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ కమిషనర్ మల్లేశ్ అన్నారు. పట్టణం వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు శనివారం బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో 170 శునకాలను పట్టించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీధి కుక్కలను పట్టుకుని, వాటి వ్యాప్తి జరగకుండా శస్త్ర చికిత్సలు చేయించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాండూరు టౌన్: పట్టణంలోని సాయిపూర్ ప్రసన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి దంపతులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, శ్రీకాంత్, పురవాసులు పాల్లొన్నారు.
డీఆర్‌డీఓ శ్రీనివాస్
మర్పల్లి: అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం త్వరలోనే ఆసరా పింఛన్లు అందించనుందని డీఆర్‌డీఓ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని కొంషెట్‌పల్లి, పట్లూర్, మర్పల్లి, కొత్లాపూర్, సిరిపురంలో ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులపై శనివారం ఎంపీడీఓ శాంత, ఏపీఎం సమ్మయ్యతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ స్ట్రక్చర్ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఓ అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రఫియొద్దీన్, పరషురామ్, లక్ష్మి మాధవరెడ్డి, సంగీతకృష్ణారెడ్డి, వార్డు మెంబర్లు ఉన్నారు.
మీర్‌పేట: అర్హులైన పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు అవగాహన కల్పించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి సూచించారు. మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు అంశంపై శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి పెద్ద ఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.


