● జిల్లా పంచాయతీ అధికారి జయసుధ
● చౌడాపూర్, మందిపల్‌లో అభివృద్ధి పనుల పరిశీలన
కుల్కచర్ల: మహిళా సమాఖ్య గ్రామ సంఘాల భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం తగదని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ అన్నారు. శనివారం ఆమె చౌడాపూర్ మండల కేంద్రంతో పాటు మందిపల్‌లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మందిపల్‌లో చేపట్టిన గ్రామ సంఘం భవన నిర్మాణ పూజలో పాల్గొన్నారు. గ్రామ సంఘాలు, పంచాయతీ భవనాల నిర్మాణాలు, సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు తదితర అభివృద్ధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆయా భవనాలకు అవసరమైన స్థలాల కోసం తహసీల్దార్లను సంప్రదించాలని సూచించారు. వీబీరాంజీ ద్వారా గ్రామాల్లో వివిధ పనులు నిర్వహించుకునేందుకు అవకాశం ఉందని, వీటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీఓ వెంకన్న, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ చంద్రశేఖర్, మందిపల్ సర్పంచ్ నాగరాజు, ఆయా గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


