మహిళా సమాఖ్యలో విజిలెన్స్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

మహిళా సమాఖ్యలో విజిలెన్స్‌ విచారణ

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

మహిళా సమాఖ్యలో విజిలెన్స్‌ విచారణ

● హార్వెస్టర్‌ లీజ్‌ పత్రాల పరిశీలన

● ఏపీఎంపై వచ్చిన ఆరోపణలపై ఆరా

తాండూరు రూరల్‌: తాండూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శనివారం విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. వరికోత యంత్రం వినియోగంతో పాటు ఏపీఎం బాలయ్యపై వచ్చిన అభియోగాలపై వివరాలు సేకరించారు. హార్వెస్టర్‌ లీజు పత్రాలు, ఆఫీసు ఖర్చులపై ఆరా తీశారు. అనంతరం డీపీఎం శేఖర్‌, ఏపీఎం బాలయ్యతో పాటు మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి భాగ్యలక్ష్మి, భానుప్రియ, నాగమ్మ, అకౌంటెంట్‌ కవితతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ నివేదికను వారం రోజుల్లో డీఆర్‌డీఓకు అందజేస్తామని వీబీజీరామ్‌జీ జిల్లా విజిలెన్స్‌ అధికారి కుసుమ మాధురి, సీబీఓఏ అడిట్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement