తాండూరు: సర్వర్ డౌన్ కారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. నాలుగు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో డాక్యుమెంట్లు పెరుకుపోయాయి. మంగళవారం ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినా తరచూ అంతరాయం కలగడంతో ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. దీనికి తోడు నలుగురు జూనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నట్లు ప్రజలు ఆరోపించారు.
విషయ పరిజ్ఞానం
పెంపొందించుకోవాలి
కొడంగల్ రూరల్: విద్యార్థులు సబ్జక్టులకు సంబంధించి విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కళాశాల జంతుశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డా.బీ.రవీందర్‌రావు, హెల్త్ కేర్ అధ్యాపకుడు కె.చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్రం, ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్‌నల్ ఎన్నిరాల్‌మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ అనే అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానమ్, అధ్యాపకులు రాంబాబు, శ్రీనివాస్, రాజేశ్వరి, మురళీకృష్ణగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: హన్మకొండలో నిర్వహించనున్న ఏఐఎస్‌ఎఫ్ 90వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌చౌహాన్ పిలుపునిచ్చారు. వేడుకలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను పట్టణంలోని విశ్వభారతి జూనియర్ కళాశాలలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఈనెల 28,29,30న మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్‌తో
దీర్ఘకాలిక ఆదాయం
కేశంపేట: రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యాస్మిన్‌భాషా కోరారు. వేములనర్వ శివారులోని బుజంగ్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో ఆయిల్‌పామ్ తొలిపంట కోత మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ఆయిల్‌పామ్ పంటకు చట్టబద్ధత ఉంద ని తెలిపారు. పంటకు ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుందని, అమ్మకోవడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. పండించిన పంటను కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్తా రని అన్నారు. సాగు చేసిన రైతులకు మూడో సంవత్సరం నుంచి దీర్ఘకాలికంగా ఆదాయం వస్తుందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంలో, వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సురేష్, జిల్లా వ్యవసాయాధికారి సుజాత, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్‌రావు, షాద్‌నగర్ ఏడీఏ, మండల ప్రత్యేక అధికారి రమాదేవి, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి, షాద్‌నగర్ హార్టికల్చర్ అధికారి హిమబిందు, హెచ్‌ఈఓలు, ఏఈఓలు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.


