మహిళా సంఘాలకు సొంత గూడు | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు సొంత గూడు

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

వికారాబాద్‌: త్వరలో మహిళా సంఘాలకు సొంతగూడు సమకూరనుంది. జిల్లాలో 657 గ్రామైక్య సంఘాలు ఉండగా వీటి పరిధిలో 16,054 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 16,3703 మంది సభ్యులు ఉన్నారు. మూడు దశాబ్దాలుగా సొంత భవనాల కోసం ఎదురు చూస్తున్నారు. సొంత గూడు లేని కారణంగా సమావేశాలు చెట్ల కింద, ఖాళీ ప్రదేశాల్లో నిర్వహించారు. సభ్యుల డిమాండ్‌ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపుతూ వచ్చారు. 2025 – 27 ఆర్థిక సంవత్సరాల్లో రెండు సార్లు భవనాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

రెండు విడతల్లో

జిల్లాకు మొదటి విడతలో 219, రెండో విడతలో 266 భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.10 లక్షలతో నిర్మించనున్నారు. 80 మంది సభ్యులు కూర్చునేలా డిజైన్‌ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మాణాలు చేపట్టారు. మొదటి విడతలో చేపట్టిన వాటిలో ఇప్పటి వరకు 11 భవనాలు అందుబాటులోకి వచ్చాయి. మరో 177 నిర్మాణలు వివిధ దశల్లో ఉన్నాయి. 31 భవనాలను ప్రారంభించాల్సి ఉంది. రెండో విడతకు సంబంధించి 35 భవనాలు నిర్మాణంలో ఉండగా మరో 231ను ప్రారంభించాల్సిఉంది. కొడంగల్‌ నియోజకవర్గం మినహా పరిగి, తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాలకు భవనాలు మంజూరయ్యాయి.

నత్తనడకన నిర్మాణాలు

ఏడాదిన్నర దాటినా మొదటి విడత భవన నిర్మాణాలు వేగం పుంజుకోవడంలేదు. 31 గ్రామాల్లో పనులే ప్రారంభం కాలేదు. 11 చోట్ల మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. రెండో విడతలో 33 భవనాలను ప్రారంభించగా 233 గ్రామాల్లో ఊసేలేదు.

జిల్లాకు రెండు విడతల్లో

485 భవనాల మంజూరు

కొనసాగుతున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement