కళాశాల ఆవరణలో మురుగు | - | Sakshi
Sakshi News home page

కళాశాల ఆవరణలో మురుగు

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

పరిశీలించిన బీజేపీ నాయకులు

డ్రైనేజీకి మరమ్మతులు చేయాలని వినతి

తాండూరు టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి పీపీ యూనిట్‌లో కొనసాగుతున్న నర్సింగ్‌ కళాశాల ఆవరణ పూర్తిగా మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతోందని మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ నాగారం మల్లేశం అన్నారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు. గత కొన్ని నెలలుగా మురుగునీటి పైపులైన్‌ పగిలిపోయి నీరంతా కళాశాల ఆవరణ చుట్టూ నిలిచిపోయిందన్నారు. తీవ్ర దుర్గంధంతో విద్యార్థినులు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు పైపులైన్‌కు మరమ్మతు చేయించి విద్యార్థినుల ఇక్కట్లను తీర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రజామాలిక్‌ ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్‌, కృష్ణ, ప్రకాష్‌, సాయిలు, సతీష్‌, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement