దోమ: ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు.. మోత్కూ ర్ గ్రామానికి చెందిన గోపాల్(23) వృత్తి రీత్యా పేయింటర్. పనికి సంబంధించిన డబ్బు అడిగేందుకు స్నేహితుడి వద్దకు బయలుదేరాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గునిగారి నర్సింహలు, శ్రీనివాస్(ఆర్మీ ఉద్యోగి) గోపాల్‌తో వాగ్వాదానికి దిగారు. తమ తల్లిని ఎందుకు దూషించావంటూ దాడి చేశారు. దీంతో గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు క్షతగాత్రుడిని పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గోపాల్ నగరంలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపారు.


