బొంరాస్‌పేట: విద్యుత్ లైన్ బాగు చేస్తుండగా పక్కనే ఉన్న మరో తీగ తగలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లి శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేగడి మైలారానికి చెందిన కావలి శంకర్ లైన్‌మెన్ మొగులయ్యతో కలిసి కరెంటు పనులు చేస్తుంటాడు. ఉదయం కురిసిన వర్షానికి విద్యుత్ లైన్ దెబ్బతిని పలు గ్రామాలకు సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల కోసం లైన్‌మెన్ మొగులయ్య తన వెంట శంకర్‌ను తీసుకెళ్లాడు. విద్యుత్ స్తంభంపై లైన్ బా గు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీగలు తాకి శంకర్ కింద పడ్డాడు. చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యా యి. చెవిలో నుంచి రక్తం రావడంతో కొడంగల్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.


