తాండూరు రూరల్: రోడ్డు పక్క ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లి వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దేముల్ ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ కథనం మేరకు.. దుగ్గాపూర్ గ్రామానికి చెందిన వడ్డె రుక్కయ్య(38) భార్య, పిల్లలతో కలిసి ధారూరులో నివాసం ఉంటున్నాడు. సమీప బంధువు వడ్డె అంజమ్మ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో శనివారం సాయంత్రం తన బైక్‌పై భార్య భీమమ్మ, బంధువు అంజమ్మను తీసుకొని దుగ్గాపూర్‌లో నాటు వైద్యం కోసం వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో మన్‌సాన్‌పల్లి శివారులో వినాయక నిమజ్జనం కోసం రోడ్డు పక్కన ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్ బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో రుక్కయ్యకు తీవ్రంగా గాయపడ్డారు. భీమమ్మ, అంజమ్మ కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్‌లో తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రుక్కయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమమ్మ, అంజమ్మ చికిత్స పొందుతున్నారు. రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ట్రాక్టర్ ట్రాలీని ఉంచిన యజమానిపై కేసు నమోదు చేసిసనట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అంత్యక్రియలకు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంపత్‌కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.
మరో ఇద్దరికి గాయాలు


