కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

తాండూరు రూరల్‌: దంపతుల మధ్య గొడవ కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని అల్లాపూర్‌ బ్రిడ్జి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోధ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కుంచారం గ్రామానికి చెందిన పోచయ్య(50) కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి తాండూరుకు వలస వచ్చాడు. అల్లాపూర్‌ సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. భార్య నాగమణితో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో కరన్‌కోట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అప్పట్లో పెద్దల ఆధ్వర్యంలో పంచాయితీ జరిగింది. పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకున్నారు. అయినా పోచయ్య తీరులో మార్పు రాలేదు. నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. రెండు రోజుల క్రితం భార్య నాగమణితో గొడవపడ్డాడు. దీంతో ఆమె సాయిపూర్‌లో ఉంటుంన్న కొడుకు రవి వద్దకు వెళ్లింది. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం అల్లాపూర్‌ బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని మేకల కాపరి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయింది పోచయ్యగా గుర్తించారు. బ్రిడ్జి వద్ద ఇనుప రాడ్‌కు ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement