మహిళను జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు | - | Sakshi
Sakshi News home page

మహిళను జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు

Sep 20 2026 7:36 AM | Updated on Sep 20 2026 7:36 AM

మియాపూర్‌: ఓ మహిళపై హోంగార్డు దురుసుగా ప్రవర్తించి దాడి చేయడంతో పాటు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనలో హోంగార్డును పోలీసు అధికారులు విధుల్లోంచి తొలగించి రిమాండుకు తరలించారు. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మియాపూర్‌ సీఐ జయరాం తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌ జిల్లా గోవిందాపూర్‌ గ్రామానికి చెందిన కడిగా ఆనంద్‌ (36) హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను డిప్యూటేషన్‌పై ఆర్పీఎఫ్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట ఆదిత్య నగర్‌ కాలనీ వైపు ఉన్న రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న కొందరిని పంపించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఓ మహిళ హోంగార్డుతో గొడవకు దిగింది. దీంతో హోంగార్డు ఆనంద్‌ ఆమైపె దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రైల్వే స్టేషన్‌లోకి తీసుకెళ్లాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారడంతో మహిళను కొట్టింది హోంగార్డు ఆనంద్‌ అని మియాపూర్‌ పోలీసులు గుర్తించారు.

స్పందించిన డీజీపీ..

ఘటనపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్‌ హోంగార్డును విధుల్లో నుంచి తొలగించాలని, క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ రమేష్‌.. ఆనంద్‌ను విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఆనంద్‌ను అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మియాపూర్‌ పోలీసులను ఆదేశించారు. మియాపూర్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని హోంగార్డు ఆనంద్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఇదిలా ఉండగా బాధితురాలి కోసం మియాపూర్‌ పోలీసులు గాలింపు చేపట్టారు.

హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ సమీపంలో హోంగార్డు దాడి

విధుల నుంచి తొలగింపునకు డీజీపీ ఆదేశం

హోంగార్డు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement