ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం

Sep 20 2026 7:36 AM | Updated on Sep 20 2026 7:36 AM

ఓటు చైతన్యంతోనే సామాజిక న్యాయం

వివిధ సంఘాల నేతల పిలుపు

అక్టోబర్‌ 16న పరిగిలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి

పరిగి: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ధ్యేయంగా అక్టోబర్‌ 16న పరిగిలోని మార్కెట్‌ యార్డ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివిధ ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రజానాయకుల భాష మారుతోందని, ప్రజలలో ఓటు చైతన్యం తెచ్చినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమని తెలిపారు. ఈ అంశాలపై ప్రజా చైతన్యమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

మహా ర్యాలీకి పిలుపు..

అక్టోబర్‌ 16న పరిగిలోని కొడంగల్‌ చౌరస్తా నుంచి గుండెపూర్‌ చౌరస్తా వరకు బృహత్‌ శ్రీమహా ర్యాలీశ్రీ నిర్వహించనున్నట్లు నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కెట్‌ యార్డ్‌లో బహిరంగ సభ ఉంటుదన్నారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ వేదిక నేత పోలేపల్లి రాములు, డీబీఎస్‌యూ నాయకుడు నర్సింహులు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌, వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుతోట సత్యనారాయణ గుప్త, మానవ హక్కుల నేత వెంకట్‌రెడ్డి, రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు హనుమంత్‌ రెడ్డి, టీపీసీసీ నేతలు జరుపుల శంకర్‌, శివగల్ల మొగులమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నేత బాల్గిరి మల్లేశ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్‌, రెడ్డి జాగృతి నేత శేషిరెడ్డి, డీబీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.రత్నం, వివిధ సంఘాల నేతలు ప్రేమ్‌ కుమార్‌, ఉప్పరి రవి సాగర్‌, డాక్టర్‌ రాములు, గోవింద్‌ నాయక్‌, ఇటక్యాల అంజయ్య యాదవ్‌, సయ్యద్‌ షా మొహమ్మద్‌ హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement