కొడంగల్: నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాలకు చెందిన 8మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సోమ వారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులకు మంచి విద్యను బోఽధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఏడాది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులు నర్సిములు, అమూల్య, మోహన్, కేశవులు, శ్రీనివా సులు, ఉమా మహేష్, అశోక్, సత్యవతి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ సాకేత్, కోశాధికారి మురహరి వశిష్ట, సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


