అదనపు కలెక్టర్ వెంకటాచారి
అనంతగిరి: సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి ఆదేశించారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,67,872 అనామలిస్ ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 1,47,738 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మరో 1,20,134 మందికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
కొడంగల్: పట్టణంలోని మున్సిప్ కోర్టు ఆవరణలో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. వివాదాల పరిష్కారానికి ఇది చక్కటి వేదిక అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్
అనంతగిరి: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం నగరంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాండూరు టౌన్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై ఆయన మాట్లాడిన తీరు సమంజసం కాదన్నారు. అసభ్య పదజాలం ఉపయోగించి స్పీకర్ మనోభావాలను దెబ్బతీసిన తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, ఉర్దూ ఘర్ చైర్మన్ జలాల్, నాయకులు వెంకటేష్, బాలరాజు, సుదర్శన్ గౌడ్, ఎబినైజర్, పార్టీ నాయకులు తదితరులు డిమాండ్ చేశారు.
బొంరాస్‌పేట: పాడి పశువులతో ఉపాధి పొందవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చౌదర్‌పల్లిలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. రంగారెడ్డి ఈఓ డీఎల్‌డీఏ డాక్టర్ అరుణశ్రీ పశువులకు చికిత్స చేశారు. నట్టల నివారణ మందు తాపాదరు. కార్యక్రమంలో సర్పంచ్ కల్పనారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, గోపాల మిత్ర సూపర్‌వైజర్ కేశవులు, గోపాలమిత్రలు బాలరాజుగౌడ్, మహేశ్, విశ్వనాథం, స్వయం ప్రకాశ్, అశోక్, వెంకటప్ప, రఘురామకృష్ణ, శివకుమార్, ఆశప్ప, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.


