పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

పూడూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాకాపూర్‌లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివారు ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశయమన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పట్లోళ్ల రఘునాథ్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌ ముదిరాజ్‌, నాయకులు శ్రీనివాస్‌, తిర్మలయ్యగౌడ్‌, ముక్కంటి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికతతో ప్రశాంతత

దోమ: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఉదన్‌రావుపల్లిలో ధ్వజ స్తంభం, నాగశిల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ శివకుమార్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement