గత ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాగ్నా బ్రిడ్జి | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాగ్నా బ్రిడ్జి

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

యాలాల: గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇందుకు కాగ్నా బ్రిడ్జిపై పడుతున్న రంధ్రాలే నిదర్శనమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బ్రిడ్జిపై ఏర్పడిన రంధ్రాన్ని, ఆ ప్రదేశంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో రెండు సార్లు బ్రిడ్జిపై భారీ గుంతలు పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇందుకు నాసిరక పనులే కారణమన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మరమ్మతులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజా, సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌, నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, మేకల రాజు, కై లా రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో..

మండలంలోని దేవనూరు, దుబ్బతండా, అక్కంపల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడి అభినందనలు తెలిపారు. నిరుపేదల సొంతింటి కలలను కాంగ్రెస్‌ సర్కారు పూర్తి చేసిందన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement