యాలాల: కంది, పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు కిలోల కందుల బ్యాగ్(పీఆర్‌జీ–176 రకం)రూ.400, పెసర నాలుగు కిలోల బ్యాగ్(ఎంజీజీ–385 రకం), రూ.304 ఉన్నట్లు తెలిపారు. అవసరం ఉన్న రైతులు యాలాల రైతు వేదికలో సంప్రదించాలన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
మోమిన్‌పేట: ప్రయాణికుల కోసం బస్టాండ్ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ సంధ్య స్పీకర్ ప్రసాద్‌కుమార్ భార్య శైలజ జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించడం కోసం బస్టాండ్ నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సుభాష్‌గౌడ్, ఎరాజ్, సిరాజొద్దీన్, ఎజాస్ పటేల్, మహంత్‌స్వామి, సమద్, మల్లారెడ్డి, మహేందర్, మహిపాల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మృతురాలిది రంగారెడ్డి జిల్లా గుర్రంపల్లి గ్రామం
తాండూరు రూరల్: పాము కాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పెద్దేముల్ మండలం జనగాం గ్రామ శివారులో గల ఫౌంహౌస్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు, నర్సమ్మ(25) దంపతులు. నాలుగేళ్ల నుంచి జనగాం గ్రామ శివారులోని ఓ ఫాంహౌస్‌లో పని చేస్తున్నారు. శనివారం రాత్రి గదిలో నిద్రిస్తున్న సమయంలో నర్సమ్మను పాము కాటేసింది. భర్త ఆంజనేయులు ఆటోలో ఆమెను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో నర్సమ్మ పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో ఆమెను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు భర్త ఆంజనేయులు ఆదివారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఆరేళ్ల పాప, ఐదేళ్ల బాలుడు ఉన్నాడు.
తాండూరు టౌన్: పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది. దీంతో ప్రజాజీవనం స్తంభించింది. శాంతినగర్, మిత్ర నగర్, గ్రీన్ సిటీ, స్నేహ నగర్ తదితర లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
అబ్దుల్లాపూర్‌మెట్: అక్రమంగా నిల్వ చేసిన డిపెన్స్ మద్యం బాటిళ్లను ఎస్‌టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టీఎఫ్ ఏటీం సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ తెలిపిన ప్రకారం.. పెద్ద అంబర్‌పేట్ సాయినగర్ కాలనీకి చెందిన తాటిపల్లి యోగేంధర్(61) తన ఇంట్లో డిఫెన్స్ మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆయన ఇంటిపై దాడిచేయగా 15 మద్యం బాటిళ్లు లభించాయి. మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని పెద్ద అంబర్‌పేట్ ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


