● దుస్తులు ఉతికే కాంట్రాక్ట్ రజకులకే ఇవ్వాలి
● రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి
కొడంగల్ రూరల్: ప్రభుత్వ ఆస్పత్రులు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక కోరారు. ఆదివారం పట్టణంలోని మహాదేవుని ఆలయ ఆవరణలో ఆ సమితి జిల్లా యూత్ అధ్యక్షుడు సీ అనిల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ పట్టణంలో అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఆస్పత్రి, గురుకుల వసతి గృహాలు, ఫార్మా కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో దోబీ పోస్టులను స్థానిక రజకులకే ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సి.బాలప్ప, దౌల్తాబాద్ వెంకటప్ప, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు లలిత, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మొగులప్ప, నాయకులు మోహన్, అన్నారం సాయిలు, ఆంజనేయులు, సంపత్, శ్యామప్ప తదితరులు పాల్గొన్నారు.


