బొంరాస్‌పేట: ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు పనులకు అడ్డొస్తే ఊరుకోం అంటూ కాంగ్రెస్ దుద్యాల, బొంరాస్‌పేట మండలాల నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మంగళవారం హకీంపేట సర్పంచ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు, కారిడార్‌లో పట్టాలు, లబ్ధిపొందిన రైతులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై బీఆర్‌ఎస్ ఆరోపణలు సరికావన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం లబ్దిచేకూరుస్తోందన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, డైరెక్టర్ బలిజ మల్లేశ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ సంజీవరెడ్డి, పోలేపల్లి నర్సింహ, సింగర్ నర్సింహ, మహేశ్, రాంచంద్రారెడ్డి, నర్సింలునాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, తదితరులున్నారు.
పట్టాలు పొందిన రైతులతో భారీ ర్యాలీ
ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం


